ఏపీలో మరో 396 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 40,855 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 94 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో నలుగురికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఆరుగురి మృతి
  • ఇంకా 5,222 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి బాగా నిదానించింది. గడచిన 24 గంటల్లో 40,855 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 396 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 94 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 61, కృష్ణా జిల్లాలో 56, విశాఖ జిల్లాలో 34, తూర్పు గోదావరి జిల్లాలో 33, పశ్చిమ గోదావరి జిల్లాలో 32 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 566 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,177 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,43,616 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,222 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,339కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Media Report
Daily Update
Today Cases

More Telugu News